Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ నగరం ఎల్బీ నగర్లో బుధ వారం జరిగిన హత్యా ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు వేటకత్తులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మృతుడు చాంద్‌పాషాకు స్వయాన తమ్ముడు కాశిబుగ్గకు చెందిన మహ్మద్ షఫి(51), నర్సంపేట శాంతినగర్‌కు చెందిన బోయిని వెంకన్న (45), వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన ఎండి సాజీద్ (32), రేగొండ మండలం రూపిరెడ్డిపల్లికి చెందిన రాగుల విజేందర్, వరంగల్ నగరంలోని ఉర్సు సుభాష్‌నగర్‌కు చెందిన ఎండి మీరా అక్బర్ (40), వరంగల్ ఎంహెచ్ నగర్‌కు చెందిన ఎండి పాషా (37)ను అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. హత్యకు గురైన మృతులలో మహ్మద్ చాంద్ పాషా, ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీ స్వయాన అన్నదమ్ముళ్లు, వీరికి నలుగురు అక్కచెల్లెళ్లున్నారు. పదేండ్ల క్రితం పరకాల ప్రాంతం నుండి వరంగల్ నగరానికి వచ్చి చాంద్‌పాషా స్థిరపడ్డారు. షఫీ పరకాలలోనే జీవనం కొనసా గిస్తున్నాడు. మృతుడు చాంద్ పాషాతోపాటు ప్రధాన నిందితుడు షఫీ ఇద్దరూ 30 ఏండ్లుగా పరకాల, జంగాలపల్లి, ఏటూర్‌నాగారం ప్రాంతాల్లో పశువులను కొనుగోలు చేసిన వెంటనే వాటిని హైద్రాబాద్‌లోని కబేళాలకు తరలించే వ్యాపారాన్ని నిర్వహించేవారు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే లాభాన్ని అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా వాటాలను పంచుకునేవారు. రెండేండ్లుగా వీరికి నష్టాలు రావడంతో, గతంలో జరిగిన వ్యాపారంలో అన్న ఎక్కువ మొత్తంలో లాభాలను తీసుకున్నాడని నిందితుడు షఫీ ఆరోపించారు. అప్పులను చెల్లించి రావాల్సిన వాటా డబ్బును తిరిగివ్వాల్సిందిగా నిందితుడు షఫీ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. ఇందుకు చాంద్‌పాషా అంగీకరించకపో వడంతో షఫీ ఒత్తిడి చేశాడు. 6 నెలల కిందట సంబంధిత రైతులు, వ్యాపా రులు పశువులను నిలిపివేయడంతో డబ్బులకు తనకు ఎలాంటి సంబంధం లేదని తన తమ్ముడు చెల్లిస్తాడని చాంద్‌పాషా.. షఫి వద్దకు పంపాడు. రూ.60లక్షల మేరకు అప్పులుండడంతో చాంద్‌పాషా స్పందించకపోవడంతో షప కక్ష పెంచుకున్నాడు. అతనితోపాటు కుటుంబసభ్యులను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. తన వద్ద పనిచేసే వారితోపాటు మిత్రులు పాషా, సాజిద్, విజేందర్, మీర్జా అక్బర్, వెంకన్నతో కలిసి హత్య చేయడానికి సిద్ధప డ్డారు. హైద్రాబాద్‌లో 5 వేలకత్తులతోపాటు వరంగల్ నగరంలో బ్యాటరీతో పనిచేసే చెట్లను నరికే బ్యాటరీ కట్టర్‌ను కొనుగోలు చేసి షఫీ ఇంట్లో రహస్యంగా దాచిపెట్టారు. మంగళవారం షఫీ ఇంట్లో కలుసుకొని పథకం రచించారు. నిందితులు సాజిద్, పాషా ఆటోల్లో మిగతా ముగ్గురు ప్రధాన నిందితుడు షఫి ఇంటి నుండి బయలు దేరారు. షఫీ ద్విచక్ర వాహనంపై మృతుడి ఇంటికి వెళ్లారు. బ్యాటరీ కట్టర్తొ వెంకన్న, మిగతా నిందితులు వేటకత్తులతోపాటు కారం పాకెట్లు వెంట తీసుకెళ్లారు. చాంద్ పాషా ఇంటి తలుపును మిషన్‌తో కట్ చేశారు. విద్యుత్ నిలిపేశారు. నిందితుల శబ్ధాలక చాంద్ పాషా లేచి గట్టిగా అరవడంతో ఆయన భార్య, బావమరిది, ఇద్దరు కుమారులు లేవగా కుటుంబసభ్యులపై కారం చల్లి దాడి చేశారు. చాంద్ పాషా, సబీర, ఖలీల్‌లను బ్యాటరీ కట్టర్‌తో విచక్షణరహితంగా కోశారు. కుమా రులు ఫహత్ పాషా, సమీర్ పాషాలపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో చాంద్‌పాషాతోపాటు ఆయన భార్య సబీరా బేగం, బావ మరిది ఖలీల్ పాషా అక్కడికక్కడే మృతిచెందారు. చాంద్ పాషా ఇద్దరు కుమారులు ఫహత్, సమీర్లు తీవ్రంగా గాయపడ్డారు. చాంద్‌పాషా కుమార్తె రుబీనా గదిలో నుండి బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ నిందితులను వేడుకోవడంతో వదిలి పెట్టారు. మృతులు చనిపోయే ముందు చేసిన అరుపులకు పొరుగు వాళ్లు రావడంతో నిందితులు ఆటోల్లో అక్కడి నుండి తప్పించుకున్నారు. 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్టు సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఆయనవెంట సెంట్రల్ జోన్ డీసీపీ కె పుష్ప, వరంగల్ ఏసీపీ కలకోట్ల గిరికుమార్ ఉన్నారు