Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
కేంద్ర; రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఎంసీపీఐ(యూ) జిల్లా సహాయ కార్యదర్శి పెద్దరపు రమేష్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో పార్టీ మండల కార్యదర్శి దామ సాంబయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, సేవారంగాల్లో సైతం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఊడిగం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పై ఎలాంటి ఆంక్షలు విధించకుండా, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతున్నా ప్రధానిగా మోడీ చరిత్రకెక్కాడని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మి నిస్సిగ్గుగా జీఓ 13 తీసుకువచ్చిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు. అమరజీవి కామ్రేడ్ ఓంకార్ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉధతం చేసి పాలకవర్గాలకు కను విప్పు కలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమా వేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంభ బాబురావు, డివిజన్ సహాయ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, డివిజన్ నాయకులు బోళ్ల సుదర్శన్, ఐ ఎఫ్ డి ఎస్ డివిజన్ కార్యదర్శి నాగరాజు, శ్యామ్, రాజు, వంశీ, భాస్కర్, సుధా, కవిత, అరుణ, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.