Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
సంతోష్ యాదవ్
నవతెలంగాణ-కమలాపూర్
బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆత్మగౌరవం పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలలో దళితులపై, మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని వాపోయారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజానీకాన్ని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే నల్లదనాన్ని తీసుకువచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తిరుపతి, రాజు, ప్రమోద్, శ్రావణ్ అనిల్ పాల్గొన్నారు.