Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర్
నవతెలంగాణ-చిట్యాల
గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర్ తెలిపారు. గు రువారం ఆయన ఓడితల, పాసిగడ్డ తండా గ్రామాల్లో పల్లె ప్రకతి వనం, ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. కరోనా పద్ధతులను పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఒడితల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మెగా పల్లె పకతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి సాంబ లక్ష్మి అదనపు కలెక్టర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామయ్య, ఏపీఓ అబ్దుల్ హలీం తదితరులు పాల్గొన్నారు.