Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్వి బందు సాయిలు అనాన్రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 6న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో చక్రపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నూతన చట్టాలతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అందరికీ రైతు బంధు సౌకర్యం కల్పించాలన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలన్నారు. మేడిగడ్డ బ్యాక్ వాటర్‌తో మునిగిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు. సింగరేణి జెన్కో ఓసిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య, కంపేటి రాజయ్య, పొలం రాజేందర్, గుర్రం దేవేందర్, సకినాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.