Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జెడ్పీ సీఈఓ, డీపీఓ
నవతెలంగాణ-మల్హర్రావు
పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ ఆశాలత అధికారులను హెచ్చరించారు. గురువారం వారు ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు, ఎంపీడీఓ నరసింహమూర్తిలతో కలిసి రుద్రారం, తాడిచెర్ల, కొయ్యుర్, వల్లేంకుంట, ఎడ్లపల్లి, మాల్లారం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగే శానిటేషన్ పనులను పరిశీలించారు. పాఠశాలలో టాయిలెట్స్ సమస్యను పరిష్కరించాలని వారు అధికారులకు తెలియజేశారు. పాఠశాలలో మైనర్ రిపైర్స్ ఉంటే చేయించాలని, వాటికి అయ్యే ఖర్చును పంచాయితీ నిధుల నుంచి వినియోగించాలని పాలకవర్గానికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులను వారు ఆదేశించారు. పాఠశాలలో రికార్డ్స్ వంట గది పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాటశాలను ట్రయల్ రన్ చేశారు. తదనంతరం బహత్ పల్లె ప్రకతి వనం పనులను పరిశీలించారు. త్వరగా పనులు చేయాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నరేశ్, శ్రీలక్ష్మీ, రాము, సత్యనారాయణ, ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.