Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) వినూత్న నిరసన
నవతెలంగాణ-గార్ల
పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నెహ్రూ సెంటర్లో గ్యాస్ బండలు మోస్తూ రాస్తారోకో నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను అమాంతం పెంచి పేదజల ఆదాయానికి గండి కొట్టి పెద్దోళ్ళ పొట్ట నింపడానికి పూనుకుందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ బడా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని అందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోన కాలంలో ఉపాధి లేక అల్లాడుతున్న ప్రజలపై ధరల భారం మోపడం సరికాదన్నారు. తక్షణమే గ్యాస్, పెట్రోల్, డిజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకుంటే ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి మెదరమెట్ల గిరిప్రసాద్, మండల నాయకులు ఇమ్మడి గోవింద్, వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, అంబటి వీరాస్వామి, చింత ఎల్లయ్య, భాగం లోకేశ్వరరావు, బి హరి, బొబ్బ ఉపేందర్, చింత మౌనిక, తాళ్లపల్లి రమా, నాగమణి, శ్రీనివాస్, సత్యం రామకష్ణ , డీకె బాబు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
పెంచిన గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో స్దానిక నెహ్రూ సెంటర్లో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలను పెంచడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడు తున్నారని అందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కార్పొరేట్ శక్తులకు ప్రధని మోడీ కొమ్ము కాస్తున్నాడని విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నాయకులు జె.వెంకన్న,శ్రీనివాస్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.