Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-వెంకటాపూర్
తెలంగాణ ప్రాంత దళితులు అందరికీ సరైన న్యాయం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. మండలంలోని నారాయణగిరి పల్లె, వెళ్తుర్ల పల్ల్లి గ్రామాల్లో దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొని ప్రజలతో మమేకమై ఆమె మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు కార్యక్రమం నిర్వ హించారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఇచ్చేవరకు దండోర యాత్ర ఆగదని హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబాల లాభాల కోసమే జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని హామీ ఇచ్చిన కెసిఆర్ ఈరోజు తమ కుటుంబ సభ్యులకు పదవులను అంటగట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో జరగనున్న దళిత దండయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ములుగు జిల్లా టిపిసిసి స్పోక్ పర్సన్ కూచన రవళి రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు నల్లేల్ల కుమారస్వామి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మైన్ మల్లాడి రాంరెడ్డి పాల్గొన్నారు.
బాధితులకు పరామర్శ
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇటీవల మతి చెందిన పలువురు మతుల కుటుంబాలను ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం పరామర్శించారు. కర్లపల్లి, మొద్దులగూడెం, పస్రా, గోవిందరావుపేట గ్రామాలకు చెందిన సనప సమ్మయ్య, రసపుత్ సమ్మయ్య, మడి మంగయ్య, వల్లభనేని కష్ణయ్య కొద్ది రోజుల క్రితం మరణించినందున వారి కుటుంబాలను సీతక్క పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూచన రవళి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్,