Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామంలో స్వయానా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వెంటెనే మల్లం పల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి పై మండల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ 2018 సంవత్సరంలో ఎమ్మేల్యే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మల్లంపల్లినీ మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మరి చారని అన్నారు. తర్వాత స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా స్థానిక ప్రజా ప్రతినిధులు మండల హామీ పై గెలిచారని, తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఒకే వేదికపై నుండి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి హామీగా ఉన్న మల్లంపల్లి ఆరు నెలల్లో మండలం చేస్తామని అన్నారని గుర్తు చేశారు. నేటికీ ఆరు నెలలు దాటినప్పటికి ఆ ఊసే ఎత్తట్లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు చంద రాము, ఎడ్ల అనిల్ రెడ్డి, పోనుగంటి రవి, బాషబోయిన సూరి, గూడెపు కర్నాకర్ రెడ్డి, ఎండి రాజసహెబ్, కుక్కల సంపత్ పాల్గొన్నారు.