Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, ఐక్యంగా పోరాడితెనె మనుగడ ఉంటుందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.సీతారామయ్య, తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి రాంసింగ్, ప్రధాన కార్యదర్శి ఎస్. కె మదార్ పిలుపునిచ్చారు. మహాబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పెంకు కార్మికులతో గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు కరోనా కాలాన్ని వదలకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మి వేస్తున్నారని అన్నారు. 2019 నుంచి వచ్చిన లాక్ డౌన్ తో ప్రజలు, కార్మికులు పనులు కోల్పోయి ఆదాయాలు లేకుండా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది మంది కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల ఆదాయాలు పెరిగిపోయాయని తెలిపారు. ఃప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు-పెంకు కార్మికుల పై ప్రభావంః అనే అంశంపై ఈ నెల 5న బయ్యారంలో తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరభద్రం, శంకర్, బజారి, వెంకట్రావు, భిక్షం, లోహ, రాజు, మోహన్, శంకర్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.