Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య
నవతెలంగాణ-కలెక్టరేట్
భూ నిర్వాసితులైన దళితులకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య కోరారు. న్యూ శాయంపేట దళితుల భూముల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భూనిర్వాసితులైన 42మంది అత్యంత నిరుపేదలైన శాయంపేట దళితులకే కేటాయించాలని కోరుతూ గురువారం హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి వినతిపత్రంతో పాటు కోర్పు తీర్పు ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హన్మకొండ లోని న్యూశాయంపేటకు చెందిన దళితులు ఏండ్ల తరబడి నివసిస్తున్నారని వివరించారు. 1973-74లో అప్పటి ప్రభుత్వం వీరికి 8-12 ఎకరాలు కేటాయించిందన్నారు. అప్పటి నుంచి ఈ భూమిపై కాస్తు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఈ స్థలంలో డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిం చగా 2020 అక్టోబర్ 20న 42 దళిత కుటుం బాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిం చాలని తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ తీర్పును వెనువెంటనే జిల్లా కలెక్టర్‌కు అందజేశామని గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు కలెక్టర్ భూమి కోల్పోయిన 42 దళిత కుటుంబాలకు ఇండ్లు ఇస్తానని ఎలాంటి స్పష్టమైన హామి ఇవ్వలేదని కలెక్టర్ స్పందించి స్పష్టమైన హామి ఇవ్వాలని కోరారు. సీపీఐ(ఎం) శాయంపేట శాఖ కార్యదర్శి వి మల్లేశం, మంద కుమారస్వామి, కొట్టె శివ, కలకోట లక్ష్మణ్, దండు దయాకర్ పాల్గొన్నారు.