Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 300 ఎకరాల భూమిని సంపాదించుకున్నాడని కాంగ్రెస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్చార్జి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సింగపురం ఇందిర ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేసి ఆమె మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడెకరాల భూమి దళితులకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. నియోజకవర్గం అవినీతికి అడ్డాగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కిసాన్ సెల్ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి, జనగామ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, జనగాం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, నియోజకవర్గ కోఆర్డినేటర్ కష్ణ మూర్తి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, మండల అధ్యక్షులు రవి, ఎంపీపీ వరలక్ష్మినరేంద్ర, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు.