Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోటగిరి సతీష్ అన్నారు. మండల కేంద్రంలో ప్రతీ దళిత కుటుంబానికి దళిత బందు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గం లోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తున్నారని, అందువలన ఎమ్మెల్యే గండ్ర తన పదవికి రాజీనామా చేసి దళితుల అభివద్ధికి కషి చేయాలన్నారు. కాంగ్రెస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి తన ఆస్తులను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ పార్టీలో చేరాడే తప్ప నియోజకవర్గ అభివద్ధికి కాదన్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు ఉధతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్, జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మేరుగు సురేష్, అల్లం ఓదెలు, బొంపల్లి రవీందర్ పాల్గొన్నారు.