Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎంహెచ్ఓ శ్రీరామ్
నవతెలంగాణ-భూపాలపల్లి
కీటక జనిత వ్యాధు లను గుర్తించడంలో హెల్త్ అసిస్టెంట్లు కీలకంగా పని చేయాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. శుక్రవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ అసిస్టెంట్లు ప్రతిరోజు తమ టార్గెట్‌లో భాగంగా రక్తనమూనాలను సేకరించి 3రోజుల లోపు లాబ్ కు పంపించాలన్నారు. తీవ్రమైన చలిజ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే మలేరియగా అనుమానించాలని తెలిపారు. తలనొప్పి, వంటినొప్పి, వణుకుతో కూడిన చలి రావటం, చెమటలు పట్టటం, వాంతులు ఉన్నట్లయితే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టి మలేరియా నిర్ధారణ అయిన వెంటనే రాడికల్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని సూచించారు. వారి బంధువులకు, సమీప ప్రాంతం వారికి కూడా కాంటాక్ట్ అండ్ మాస్ రక్తపూతలు సేకరించాలని పేర్కొన్నారు. గ్రామంలో ఎక్కువమంది జ్వరాలతో బాధపడుతుంటే ఇంటింటా ఫివర్ సర్వే నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటింపజేయాలన్నారు. దోమల వలన వచ్చే వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హెల్త్ అసిస్టెంట్లు ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో యాప్‌లో అటెండెన్స్ వేసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. క్రియాశీలకంగా పనిచేయాలని, రిపోర్ట్స్, రికార్డ్స్, అప్ డేట్‌గా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఉమాదేవి, మాస్ మీడియా ఆఫీసర్ అన్వర్, సబ్ యూనిట్ ఆఫీసర్ నాగిరెడ్డి, సి.హెచ్.ఓ.రాజయ్య , హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.