Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఆజంజాహి భూములు కార్మికులకే కేటాయించాలని ఆజంజాహి మిల్స్ మోడిఫైడ్ వాలంటరీ రిటైర్మెంట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం ఓ సిటీ మైదానంలో అసోసి యేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతి నిధులు జన్ను ప్రభాకర్, సాంబయ్యలు మాట్లాడుతూ ఆజంజాహి భూముల పరిరక్షణ కోసం కార్మికులు ఆందోళన చేస్తూ హైకోర్టులో గెలిచామన్నారు. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సమయంలో వరంగల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని మిల్లు భూముల్లో నిర్మించాలని చూడడం సరికాదన్నారు. కార్మికులకు దక్కాల్సిన భూమిని ప్రభుత్వ అధికారులు సుప్రీం కోర్టు హైకోర్టు లలో కేసులు వేసి కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, లేకుంటే పోరాటం ఉదతం చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగం,. సమ్మయ్య, నాగరాజు, హరి నారా యణ, రాజమౌళి, చంద్ర మోహన్, కృష్ణ పాల్గొన్నారు.