Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆర్జేడీ జయప్రద బాయి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎ.గోపాల్‌తో కలిసి ఆమె శుక్రవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష బోధన తరగతులను పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరంలో జరిగిన అడ్మిషన్లను, గత విద్యా సంవత్సరంలో సాధించిన ఫలితాలను అడిగి తెలుసు కున్నారు. కోవిడ్ నిబందనలను పాటిస్తూ తరగతుల నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కళాశాలలో మౌళిక వసతుల కల్పనపై సమీక్షించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ బి.సునీత, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులున్నారు.