Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ఆపదలో ఉన్న మహిళలు, యువతులు సఖీ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ కార్పొరేటర్ లావుడ్య రవినాయక్ అన్నారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ కాసుల సరిత ఆధ్వర్యంలో శుక్రవారం గుండ్లసింగారం గణేష్ నగర్ కాలనీలో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్, మహిళా అభివద్ధి శిశు సంక్షేమ శాఖ సహకారంతో అంగన్వాడి కార్యకర్తలకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సఖీ వన్ స్టాప్ సెంటర్ వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సఖీ సెంటర్ ద్వారా సమస్యలో ఉన్న మహిళలకు, యువతులకు, బాలికలకు ఐదు రకాల సేవలను అందిస్తుందన్నారు. సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి మహిళా, యువతి, బాలిక తప్పకుండా సఖీ సేవలను సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితులలో టోల్ ఫ్రీ నెం.181, సెల్ నెం.0870-2552112 నెంబర్కు ఫోన్ చేసి కౌన్సిలింగ్, న్యాయ, వైద్య, తాత్కాలిక వసతి సహాయాలు పొందవచ్చని తెలిపారు.