Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంఈఓ దేనానాయక్
నవతెలంగాణ-భూపాలపల్లి
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఎంఈఓ అజ్మీర దేవా నాయక్ అన్నారు. శుక్రవారం గడ్డిగాని పల్లి, సిగ్గంపల్లి, ఫకీర్గడ్డ, గోపువారి పల్లి, కాసిం పల్లి, చల్లూరు పల్లి పాఠశాలలను ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా పాఠశాలకు హాజరు కాని సెగ్గంపల్లి ప్రధానోపాధ్యాయులు పీ శ్రీనివాస్‌కు మెమో జారీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా పాఠశాలకు రా కుండా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యను బోధించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఉపాధ్యాయులు తప్పనిసరి అయితే తప్ప సెలవు పెట్టకూడదని మార్గదర్శకాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కానీ కొందరు ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభమయిన మూడు రోజులకే చెప్పాపెట్టకుండా ఏగ నామాలు పెట్టడం సరి కాదన్నారు. ఉపాధ్యాయులు సమయ స్ఫూర్తితో సమయపాలన పాటించి విద్యార్థులను బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు.