Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీస్ కమిషనర్ డా|| తరుణ్ జోషి
నవతెలంగాణ- సుబేదారి
పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వారికి ఆదర్శంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా||తరుణ్ జోషి అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు పూర్వ వరంగల్ జిల్లా పరిధిలో ఎస్హెచ్ఓ విధుల్లో శిక్షణ పొందిన 62 మంది ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్లతో శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ భీమారంలోని పోలీస్ కళ్యాణ మండపంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎస్‌హెచ్‌ఓలుగా శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఎస్సైలు శిక్షణ పొందిన సమయంలో వారి అనుభవాలతో పాటు, ఎదుర్కోన్న సమస్యలు, నేరాలు నియంత్రణ కోసం తీసుకోవల్సిన చర్యలు, వర్టికల్ విధానం గురించి వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సుదుపాయలను అందిబుచ్చుకుని విధుల్లో సమర్థవంతంగా రాణిస్తూనే ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు రకరకాల సమస్యలతో కూడిన ఫిర్యాదు వస్తువుంటాయి. అలాంటి సమయాల్లో వాటిని పరిష్కరించేందుకు అవసమయిన మార్గాలను కనుగొనాలన్నారు. విధి నిర్వహణ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు.
విధులు నిర్వహించే సమయంలో స్థానిక ప్రభుత్వ ,ప్రవైయిట్ విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రజలతో ఎస్హెచ్ఓ సత్సంబంధాలను కొనసా గించాలన్నారు. సమాజం లోని సాంఘిక దురచారాలను నిర్మూలించడమనేది ప్రతి పోలీస్ అధికారి వ్యక్తిగత భాధ్యతగా గుర్తించాల్సి వుంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు వర్యవేక్షిస్తునే వారితో సమన్వయంతో పనిచేయాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటక్ష్మీ, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, అదనపు డీసీపీలు జనార్దన్, భీంరావుతో పాటు ఏసీపీలు, ఆరైలు, ఇన్స్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.