Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గత కొద్దిరోజులుగా విషజ్వరాలు డెంగ్యూ, మలేరియాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో మండల వైద్యాధికారిని ప్రియాంక ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ గత వారం క్రితం మొదటి సారిగా వైద్య శిబిరం నిర్వహించా మన్నారు. పరిస్థితులను గుర్తించడం కొరకు మరొక్కసారి వైద్య శిబిరం నిర్వహించా మన్నారు. వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోన, చికెన్ గున్యా, మలేరియా, పరీక్షలు నిర్వహించి 120 మందికి మందులను అందించామన్నారు. కాలువల్లో దోమల నివారణకు స్ప్రై చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గిరగాని హేమలత, సబ్ యూనిట్ ఆఫిసర్ తిరుపతిరెడ్డి, ఏ.ఎన్.ఎమ్.లత, పి.ఎచ్. ఎన్.భాగ్యలక్ష్మి, ఎచ్ఈఓ రమేష్, హెల్త్ అసిస్టెంట్ రాపోలు వేణు కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ ఎండి ఖయ్యుమ్ పాల్గొన్నారు.