Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
శుక్రవారం సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ దివ్యరాజన్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చాంగ్తూ, హరితహారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ ముఖ్య కమిషనర్ లతో కలిసి స్థానిక అంగన్వాడి2 కేంద్రాన్ని పరిశీలించారు. ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడె నాగజ్యోతి, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ లు ఏజెన్సీలోని విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, డ్రైనేజీలు పలు సమస్యలపై వినతి పత్రాలను అందించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రతిస్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, ఐటీడీఏ భద్రాచలం పీవో వీపి గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభీ, ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : బ్రాహ్మణపల్లి ఆసుపత్రిలో మహిళల కాన్పుల కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎంఓ స్మితా సబర్వాల్ జిల్లా వైద్య ఆరోగ్య వాఖ అధికారి అప్పయ్యను ఆదేశించారు. శుక్రవారం ఆమె బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. బ్రాహ్మణపల్లి నుండి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రి 30 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం ఆసుపత్రి 80 కిలో మీటర్ల దూరం ఉన్నందున గర్బవతులు అత్యవసర వేళల్లో ఇబ్బంది పడే అవకాశాలున్నందున ఇక్కడే డెలివరీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించిన స్మితా సబర్వాల్ సిబ్బంది, మందుల కొరత తదితర అంశాలను వైద్యురాలు మంకిడి ట్వంకిల్ నిఖిత నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలలో పంట పొలాలున్నందున పాములు, విష కీటకాలు చేరే అవకాశమున్నందున యుధ్ద ప్రాతిపధికపై ఆసుపత్రి చుట్టూ ట్రెంచ్ పనులు చేయించాలని అప్పయ్యను ఆదేశించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ, మహిళ ,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ దివ్యరాజన్, తెలంగాణ హరితహారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, రాష్ట్ర ఐఏఎస్ మహిళా అధికారులు క్రిస్టీనా జడ్ చోంగ్తూ, వాకాటి కరుణ, దివ్య, ప్రయాంక బంధం భద్రాచలం ఐటిడీఏ అధికారి గౌతమ్ పోత్రు, జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్.దివాకర, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం టౌన్ : శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి వెల్నెస్ సెంటర్‌ను గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టియానా జెండ్ చొంగ్తూ, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, స్త్రీ,శిశు సంక్షేమ కమిషనర్ దివ్వదేవరాజన్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌లతో కలిసి సీఎంఓ తనిఖీ చేశారు. ముందుగా కన్నాయిగూడెం పీహెచ్సీ పరిధిలో గల వెల్నెస్సెంటర్(సబ్‌సెంటర్)ను పరిశీలించారు. గర్భిణులకు రెగ్యులర్ చెకప్‌లు, సాధారణ డెలవరీలు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయని, బాలింతలకు, చిన్నారులకు కావాల్సిన మందులు ఉన్నాయా లేదా తెలుసుకున్నారు.