Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్లో అంతర్మథóనం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సమితి గురువారం నిర్వహించిన జెండా పండుగతో పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో జరుగుతుందా ? అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో సర్వత్రా వినిపిస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీ జరిగినప్పుడల్లా పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తామని, గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమించి పార్టీని పటిష్టం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేయడం షరా మామూలే. అటువంటి ప్రకటన నేపథ్యంలోనే గురువారం రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగను గులాబీ శ్రేణులు నిర్వహించుకున్నాయి. అంత వరకు బాగానే వుంది. ఇప్పటికైనా గ్రామస్థాయి, మండలస్థాయి, జిల్లా స్థాయి పార్టీ కమిటీలను నియమిస్తారా ? లేదా ? అన్న విషయంలో పార్టీ శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీఆర్ఎస్ ప్లీనరీ జరిగినప్పుడల్లా పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటనలు చేయడం టిఆర్ఎస్లో సహజమే. కాని ఏనాడు క్షేత్రస్థాయి నుండి పార్టీని నిర్మించిన సందర్భాలు లేవు. దీంతో పార్టీ శ్రేణుల్లో పార్టీ నిర్మాణంపై ఆసక్తి కరువైంది. తాజాగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ వార్డు, గ్రామ, మండల, పట్టణ కమిటీలతోపాటు జిల్లా కమిటీలను నియమిస్తామని ప్రకటించారు. ఇందుకు షెడ్యూల్‌ను కూడా నిర్ణయించారు. అంతవరకు బాగానే వున్నా, ఈ ప్రకటనలపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం కుదరడం లేదు. గతంలో కొంగరకలాన్ ప్లీనరీ అనంతరం కూడా ఇదే తరహా ప్రకటనలు చేసినా పార్టీ నిర్మాణంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టి పెట్టలేదు. గత 7 ఏండ్లుగా టిఆర్ఎస్ అధికారంలో వున్నా ఆ పార్టీకి జిల్లా కమిటీలు రద్దు చేసి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గ కమిటీలను నియమిస్తామని ప్రకటించినా నేటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో పార్టీ నిర్మాణంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనలపై పార్టీ శ్రేణులు సైతం ఆసక్తిగా లేకపోవడం గమ నార్హం. ఇదే క్రమంలో గతంలో మాదిరిగి ఈసారి జెండా పండుగలో అంత జోష్ కూడా కనిపించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నిర్మాణంపై రాష్ట్ర నాయకత్వం ప్రకటనలు చేయడం వెనుక ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి సంస్థాగతంగా బలపడడమే కారణమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.
జిల్లా కమిటీలు రద్దు చేసినా ప్రత్యామ్నాయం ?
టీిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ తప్పా జిల్లా కమిటీలు లేవు. జిల్లా కమిటీలు లేకుండానే ఆ పార్టీ నాయకత్వం పార్టీ కార్యక్రమాలను ఎమ్మెల్యేలే బాస్లంటూ ప్రకటన చేసి వారి కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలను నిర్వహి స్తుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తొలినాళ్లలో మాత్రమే గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమించారు. అనంతరం గ్రామ, మండల కమిటీలను కూడా మరిచిపోయి కేవలం జిల్లా కమిటీలకే పరిమిత మయ్యారు. కొన్నేండ్ల క్రితం జిల్లా కమిటీలను కూడా రద్దు చేసి వాటి స్థానంలో నియోజకవర్గస్థాయి కమిటీలను వేస్తామని ప్రకటించి మరిచిపోయారు. టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్, రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్‌కు ఈ విషయం గుర్తు చేసేంత దమ్ము, ధైర్యం పార్టీ నేతలకు లేదు. దీంతో వారి నిర్ణయాల మేరకే ఆచరణ ప్రారంభించే వరకు పార్టీ నేతలు సంయమనంతో వుండడం తప్పా చేయగలిగిందేమి లేదు. అందుకే జిల్లాస్థాయిలో ఎలాంటి కమిటీలు లేకుండా ఇన్నేండ్లు పార్టీ ముందుకు నడిచింది. రాష్ట్రంలో విపక్షాలను నిర్వీర్యం చేయడంతో ఆ పార్టీలు బలహీన పడిన నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు పార్టీ నిర్మాణంపై పట్టింపు లేకుండా పోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్, బిజెపిలు సంస్థాగతంగా బలప డడమే కాకుండా ప్రభుత్వం చర్యలను ఎండగడుతూ భారీ కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో విపక్షాలను ఎండగట్టడానికి ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు పార్టీ నిర్మాణం గుర్తుకు వచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
విపక్షాల హల్చల్తో..
రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపిలు రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేయడం, ప్రభుత్వ విధానాలను ఎండ గడుతుండడంతో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి, విపక్షాల విమ ర్శలను తిప్పి కొట్టడానికి పార్టీ నిర్మాణం నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అవసరమయ్యాయి. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోని రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే పార్టీ నిర్మాణానికిగాను షెడ్యూల్‌ను ప్రకటించి ఈనెల 20వ తేదీలోపు గ్రామ, మండల, పట్టణ, జిల్లాకమిటీలను నియమించి, అనం తరం రాష్ట్ర కమిటీని నిర్మించనున్నారు. ఈ షెడ్యూల్‌పై సైతం పార్టీ నేతలకు సందేహాలున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే బాస్లన్నా రాష్ట్ర నాయకత్వం తాజాగా పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని భావించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బిజెపిల దూకుడేనన్నది బహిరంగ రహస్యమే. ఏదేమైనా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన పలువురు నేతలు టీిఆర్ఎస్ను వీడి విపక్షాల్లో చేరడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.