Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంచాయతీరాజ్‌శాఖ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద వహిం చాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలం లోని తొర్రూరు(జే) ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల ను మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. తరగతుల నిర్వహణ, చేపట్టిన కోవిడ్ నియంత్రణ చర్యల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాదాపు 17 నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ప్రత్యేక పారిశుధ్య చర్యలపై పంచాయతి సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు తెలి పారు. ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, పంచాయతీ కార్య దర్శి సమన్వయంతో పనిచేయాలన్నారు. పాఠశాలల పరిస రాలు, తరగతి గదులు, వంట గదులను ప్రతిరోజు శుభ్రపర చాలన్నారు. మంచి నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేపట్టి, పిల్లలకు శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు దరిచేరకుండా పాఠశాలల ఆవరణలో నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశా లలకు వచ్చే పిల్లలు, బోధనా, బోధనేతర సిబ్బంది అంతా మాస్క్‌లు ధరించాలని, సానిటైజర్, సబ్బులు అందు బాటులో ఉంచాలని అన్నారు. ప్రతి పిల్లవానిని ధర్మల్ స్కానర్‌తో పరీక్షించి అనుమతించాలని, కోవిడ్ లక్షణాలున్న వారిని వెంటనే పరీక్షలకు పంపాలని అన్నారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలని అన్నారు. అనం తరం పిల్లలతో మమేకమై టీచర్లు ఎలా చదువు చెప్పుతు న్నది, మధ్యాహ్న భోజనం ఎలా ఉన్నది అడిగి తెలుసు కున్నారు. ఉపాధ్యాయులు పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు, విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితరాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గాదరి సోమలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.