Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
దళారుల మాయమాటల నమ్మి వికలాం గులు మోసపోవద్దని దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వడగం ఆంజనేయులు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రావుల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి దామెర రమేష్ తో కలిసి ఆంజనేయులు మాట్లాడారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాల పేరుతో వికలాంగుల మధ్య దళారులుగా పని చేస్తూ మోసాలకు పాల్పడుతూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మోసాలకు పాల్పడే వారి సమాచారాన్ని మండల జిల్లా కమిటీలకు ఇవ్వాలని సూచించారు. మధ్య దళారీలు వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. అర్హులైన వికలాంగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి తప్ప దళారీలను ఆశ్రయించ వద్దని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే డబుల్ బెడ్రూం ఇండ్లలో వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరారు. వికలాంగులు ఆస్పత్రులకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ తీసుకునే పరిస్థితి లేదని . వారి ఇండ్ల వద్దకు వెళ్లి టీకా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి మంద ఎల్లయ్య, మండల నాయకులు గాదరి యాదయ్య, పులి సోమరాములు, తదితరులు పాల్గొన్నారు.