Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
గుమ్ముడూరు ప్రాథమిక పాఠశాల, మహబూబాబాద్ లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను శి శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం తనిఖీ చేశారు. పిల్లలను తప్పనిసరిగ పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్ధుల హాజరు శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయుల హాజరును, విద్యార్ధుల హాజరును, తరగతి గదులను, పాఠశాలలో గల ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్ధుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, విద్యార్ధుల హాజరు శాతం పెంచుటకు తీసుకున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు హాజరైన విద్యార్ధులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్ధుల హాజరు శాతం పెంచేలా కషి చేయాలని, పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.