Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని బోల్లపల్లి గ్రామంలోని దళిత రైతులు పోడు సాగు చేసుకుంటున్న క్రమంలో మిర్చి తోటను అటవీశాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది అతి ఉత్సాహం తో శుక్రవారం తొలగించారు. దీంతో దళిత రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గత నెల క్రితం ఈ పోడు భూముల విషయంలో మహబూ బాబాద్ రేంజ్ పరిధిలోకి వచ్చే ఈ భూముల్లో అటవీశాఖ అధికారులు ప్లాంటేషన్ నాటేందుకు సన్నాహాలు చేయగా గిరిజన దళిత రైతులు ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ రంగంలోకి దిగి దళిత రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాడు ప్లాంటేషన్ మొక్కలను నాటడం నిలిపివేశారు. కాగా కొందరు గిరిజనుల పోడు భూములను స్వాధీనం చేసుకుని అట్టి భూముల్లో ప్లాంటేషన్ లొ మొక్కలు నాటారు. మిగిలిన పోడు భూముల్లో దళిత రైతు హెచ్ శ్రీను మిర్చి పంటను 10 గంటల్లో వేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది శుక్రవారం తొలగించారని దళిత రైతులు వాపోయారు. అటవీ శాఖ అధికారులతో సిబ్బంది తీవ్ర వివాదానికి దిగడంతో అటవీ శాఖ అధికారులు వెనుతిరిగి వెళ్లినట్టు తెలిపారు.