Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టూరిజం ప్యాకేజీ లో
పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి
ఆరు నెలల్లో అభివృద్ధి
పనులు పూర్తి చేయాలి
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో
ముందుకు సాగని పనులు
పనుల పురోగతిపై
దృష్టిపెట్టాలి
పంచాయతీరాజ్‌శాఖ
మంత్రి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, ఆల యాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టాడని, టూరిజం ప్యాకేజీలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి... చారిత్రక కట్టడాల అభివృద్ధికి నిదర్శనమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని వల్మిడి లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రూ.2 కోట్లతో గర్భ గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ జిల్లాలోని పాలకుర్తితోపాటు జనగామ, జఫర్గడ్ మండలాల్లో చారిత్రక కట్టడాల అభివృద్ధికి టూరిజం ప్యాకేజీ లో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. 42 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని రాముడు వనవాస సందర్భంలో వల్మిడి లో సంచరించినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. చారిత్రక నేపథ్యం గల వల్మిడిని టూరిజం ప్యాకేజీ లో అభివద్ధి చేసేందుకు ఏడు కోట్ల యాభై లక్షలు మంజూరు చేశామని తెలిపారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే టూరిజం ప్యాకేజీ పనులు ముందుకు సాగడం లేదని, అభివద్ధి పనులను పూర్తి చేసేందుకు కొత్త కాంట్రాక్టర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రూ.2 కోట్లతో గర్భగుడి నిర్మాణం. 3కోట్లతో అతిథి గృహంతో పాటు, అర్చకుల నిర్వహణ కోసం, కోటి యాభై లక్షల తో గుట్టపైకి రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. భద్రాచలం తరహాలో వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివద్ధి చేసి శ్రీరామ నవమి సందర్భంగా జరిగే కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ ప్రాంత చారిత్రక చరిత్రను వెలికితీసి భావితరాలకు అందించాలని మంత్రి సూచించారు. ఆరు నెలల్లో అభివద్ధి పనులు పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులతోపాటు, పాలకుర్తిలో టూరిజం ప్యాకేజీ పనులు ముందుకు సాగడం లేదని అభివద్ధి పనుల పై అధికారులు దష్టి పెట్టడం లేదని ఆయన అసంతప్తి వ్యక్తం చేశారు. అభివద్ధి పనులన్నింటినీ పూర్తిచేసి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజ కవర్గంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, పాలకుర్తి ఆలయ చైర్మన్ వెనకదాసుల రామచంద్ర శర్మ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్,పాలకుర్తి ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న. వల్మిడి ఆలయ చైర్మన్ వీరమల్ల జైహింద్, సర్పంచ్ కత్తి సైదులు, ఎంపీటీసీ తాళ్ల సోమ నారాయణ ఉపసర్పంచ్ నీరటి సోమయ్య, గ్రామస్తులు వీరమల్ల దేవేందర్ వీరమల్ల బాబురావు మోకాటి సైదులు, ప్రభాకర్, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, ఆర్అండ్ బీ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నార