Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్గా పి ప్రావీణ్య శుక్రవారం ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కమీషనర్ సీహెచ్ నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ సునీత, ఎక్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర రావు, పీఆర్వో ఆయూబ్ అలీ, డీఎఫ్ఓ కిషోర్, సిటీ ప్లానర్ బానోతు వెంకన్న, సెక్రటరీ విజయ లక్ష్మి, డిప్యూటీ కమీషనర్లు జోనా, రవీందర్ యాదవ్, పన్నుల అధికారి శాంతి కుమార్ తదితరులు కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విభాగాల వారిగా అధికారులతో పరిచయం చేసుకున్న కమీషనర్ అనంతరం మాట్లాడుతూ.. జీడబ్య్లూఎంసీ పరిధిలో వివిధ పథకాల క్రింద ఆయా విభాగాల ద్వారా కొనసాగుతున్న, పెండింగ్లో ఉన్న, చేపట్టబోయే అభివద్ధి పనుల అప్డేటెడ్ సమాచారం సంబంధిత విభాగ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. విభాగాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని కమీషనర్ అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన మునిసిపల్ చట్టం-2019 గురించి అధికారులందరూ క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు