Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసీపీ బ్లాక్1 ఉపరితలంలో కోల్పోయిన భూముల్లో అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు స్థానిక ప్రజల ఆరోపణల నేపథ్యంలో టీఎస్ జెన్కో అధికారులు ఆదివారం సర్వేలు నిర్వ హించారు. టీఎస్ జెన్కో, రెవెన్యూ అధికా రులు సంయుక్తంగా ఓసిపి ఉపరితలం, డేంజర్ జోన్ భూ హద్దులు పదేళ్ల క్రితం నిర్దారణ చేసి హద్దు రాళ్లను వేశారు. అయితే కొందరు అక్రమార్కులు ఓసీపీ ఉపరితలంలో కోల్పోయిన భూములకు గతంలో నష్ట పరిహారం సైతం తీసుకొని అట్టి భూములు స్థానికేతరులకు మాయ మాటలు చెప్పి విక్రయించడంతో కొనుగోళ్లు చేశారు. వారు రాత్రికిరాత్రే అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేస్తున్నట్టు బహిరంగంగా పలువురు ఆరోపించారు. దీంతో అక్రమ ఇంటి నిర్మాణాల బాగోతం భరతం పట్టేందుకు జెన్కో అధికారులు విస్తతంగా సర్వేలు చేపట్టారు.