Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ఎన్ని జన్మలెత్తినా అంబేద్కర్ రుణం తీర్చుకోలేమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలన్నారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన పట్ల అంబేద్కర్ పోరాట పటిమను చరిత్ర మరిచిపోలేనిదన్నారు. మహణీయుల అడుగుజాడల్లో ప్రజలంతా పయణించాలని సూచించారు. నియోజక వర్గంలోనే పల్లగుట్టను ఆదర్శ గ్రామంగా నిలుపుకునేందుకు అందరు కలిసికట్టుగా కషిచేయాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టాన్డింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, చిల్పూర్ దేవస్థాన చైర్మెన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఇల్లందుల సుదర్శన్, సర్పంచుల ఫోరం జిల్లా అధికార ప్రతినిధి తాటికొండ సురేష్, కొమురెల్లి దేవస్థాన మాజీ చైర్మెన్ సెవెళ్లి సంపత్, సర్పంచ్ బొట్టు మానసనరేందర్, ఎంపీటీసీ జీడి ఝాన్సీరాణి, సాదం నర్సింహులు, మండల అధ్యక్షులు గుర్రపు వెంకటేశ్వర్లు, ఇన్చార్జి పోలేపల్లి రంజిత్ రెడ్డి, మారబోయిన ఎల్లయ్య, డైరెక్టర్ చిర్ర నాగరాజు, మీడియా ఇన్చార్జి రంగు రమేష్, విష్ణువర్ధన్‌రెడ్డి, బొట్టు చేరాలు, జీడి ఆనందం, రమేష్‌నాయక్, గట్టయ్య, రమేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.