Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైన దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మద్ అబ్దుల్ హై అధ్యక్షతన జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహిం చారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్టర్ దివాకర్ పాల్గొని మాట్లాడారు. కోవిడ్ కారణంలో విద్యా రంగం చాలా వెనుకబడిందని, ఉపాధ్యాయులందరూ కలసికట్టుగా కష్టించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ఉత్తములుగా తీర్చిదిద్దాలని సూచించారు. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి మానవ వనరులను అందించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని అన్నారు. డీఈఓ మహమ్మద్ అబ్దుల్ హై మాట్లాడుతూ... కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష విద్యా బోధన లేక ఆన్లైన్ బోధనతో ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారని అన్నారు. ఆధునిక మెలకువలతో నాణ్య మైన బోధన అందించి విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించాలని అన్నారు. అనంతరం 27మంది ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ మువ్వ హరికష్ణ, ఏఎంఓ మనోహర్‌నాయక్, సీఎంఓ కిషన్‌రావు, జీసీడీఓ శివరంజని, డీసీఈబీ సెక్రెటరీ రవీందర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య, కష్ణమోహన్, ఏసీజీఈ జుమ్మునాయక్ పాల్గొన్నారు.