Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా మండలంలోని చల్వాయి జెడ్పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు చల్లగరుగుల మల్లయ్యను ఏపీలో గురుపూజోత్సవం సందర్భంగా ఆదివారం ఘనంగా సన్మానించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట జంపని భాస్కర్ సినీ కల్యాణ మంటపం శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో జయ జయ సాయి ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మెన్ పూసపాటి బాలాజీ అధ్యర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం, గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరోనా కష్టకాలంలో కరోనా బాధితులకు నిస్వార్థ సేవలు అందించిన తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులను, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కరోనా లాక్డౌన్, కరోనా ప్రబలుతున్న సమయంలో బాధితులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు, కరోనా వ్యాధి నిరోధక కషాయం ప్యాకెట్లు, కరోనా మెడికల్ కిట్లు, ఆయుర్వేద వ్యాధి నిరోధక కషాయం ఉచితంగా పంపిణీ చేసి నిస్వార్థ సేవలు అందించిన చల్వాయి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాద్యాయుడు చల్లగురుగుల మల్లయ్యను ప్రతిష్టాత్మక శ్రీసాయి గ్లోబల్ పురస్కారంతో ఘనంగా సన్మానించారు. సుమారు 600 మాస్కులు, 900 మందికి ఆయుర్వేద వ్యాధి నిరోధక కషాయం, 500 ఆయుర్వేద వ్యాధి నిరోధక ప్యాకెట్లు, 200 మందికి మెడికల్ కిట్లు, కరోనా రోగుల సహాయకులకు ఉచిత భోజన వితరణ లాంటి అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సేవలు అందించిన మల్లయ్యకు నిర్వాహకులు ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందించి శాలువాతో సన్మానించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, వినియోగదారుల సేవా కార్యక్రమాలు, ప్రకతి సంరక్షణ, పర్యావరణ హిత కార్యక్రమాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, హరితహారం, తదితర పర్యావరణ హిత కార్యక్రమాలతోపాటు ఉపాధ్యాయడిగా అంకితభావంతో పని చేస్తున్న మల్లయ్యను నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో చిలుకలూరిపేట మున్సిపల్ చైర్పర్సన్ షేక్ రఫానీ, తాళ్లూరి సువర్ణకుమారి, రంగిశెట్టి రమేష్, కొలిశెట్టి శ్రీనివాసరావు, పల్లెటి వెంకటేశ్వరరావు, జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి తదితరుల చేతుల మీదుగా మల్లయ్యను సన్మానించారు. కాగా మల్లయ్యను మండలానికి చెందిను ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.