Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
దళితబంధు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఓటమి తప్పదన్న భయంతోనే హుజురాబాద్ ఉపఎన్నికను వాయిదా వేయించిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాలులో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల విస్తత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 500 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సీతక్క ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. సమాజంలో యువత కీలకమని చెప్పారు. యువత తల్చుకుంటే సాధ్యం కానిదేదీ లేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమ, దోపిడీ ప్రభు త్వాలపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్న మైందని చెప్పారు. ఓటమి భయంతోనే హుజురాబాద్ ఉపఎన్నికలను సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ వాయిదా వేయించారని ధ్వజ మెత్తారు. దళిత బంధు ప్రకటించినా ఓటమి తప్పదనే సర్వే వెల్లడి కావడంతో ఓడిపోతే పరువు పోతుందనే భయంతోనే వాయిదా వేయించారని చెప్పారు. ఢిల్లీలో తమకు బాస్ లేరని చెప్పిన ముఖ్యమంత్రి ఢిల్లీలో కార్యాలయ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తూ బీజేపీకి వంగి నమస్కారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ తో రాష్ట్రంలో కుస్తీ అంటూనే ఢిల్లీలో దోస్తీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండి పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన, గిరిజ నుల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగు పడతాయని ఆశతో యువత ప్రాణాలకు తెగించి పోరా డగా అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను నమ్మించి ఊరికొకటి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, తదితర అన్ని హామీలనూ తుంగలో తొక్కి మోసపూరిత పాలన సాగిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులను, మంత్రులను కలుస్తూ సహకారం కోరుతున్నట్టు తెలిపారు. దాతలు సైతం అండగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్‌కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మల్లాది రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య రాజు, ఎంపీటీసీ లు గోపిదాసు ఏడుకొండలు, ధరావత్ పూర్ణ గంగు, చాపల ఉమాదేవి, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సూదిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, తేళ్ల హరిప్రసాద్, సహకార సంఘ సభ్యులు పాశం మాధవరెడ్డి, జెట్టి సోమయ్య, కొట్టెం కష్ణ, సర్పంచ్‌లు లావుడ్య లక్ష్మీ జోగా నాయక్, ముద్దబోయిన రాము, వాసం కన్నయ్య, సనప సమ్మయ్య, భూక్య సుక్య, ఉపసర్పంచులు బద్దం లింగా రెడ్డి, కట్ల జనార్ధన్‌రెడ్డి, చాపల కిషన్‌రెడ్డి, జంపాల చంద్రశేఖర్, భూక్య సారయ్య, జాటోత్ చంద్రకాంత్, పొన్నం సాయి, గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్రావు, నాయిని వెంకన్న, వేల్పుగొండ ప్రకాష్, బొల్లు కుమారస్వామి, సోమసాని నారాయణస్వామి, వాసం రాము, కోరం రామ్మోహన్, కంటెం సూర్యనారా యణ, అలుగుబెల్లి కన్నయ్య, బర్ల సమ్మిరెడ్డి, పాలెం యాదగిరి, పాడ్య రాజు, చెరుకుల సురేష్, గ్రామ యూత్ అధ్యక్షులు మద్దినేని వినరు, కొర్ర శ్రీను, రాజశేఖర్, బర్ల కిరణ్, వంక సాంబయ్య పాల్గొన్నారు.