Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
సమాజాభివద్ధిలో ఉపాధ్యాయులు కీలకమని ప్రభుత్వ ఛీప్‌విప్ వినరు భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా సమీకృత కలక్టరేట్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ఛీప్‌విప్ దాస్యం వినరుభాస్కర్, జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్‌లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకష్ణన్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్ మాట్లాడుతూ.. సమాజ మార్పు కోసమని అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులే నిజమైన ప్రజా సేవకులని కొనియాడారు. ఉపాధ్యయ దినోత్సవం ఒక్క రోజుకే పరిమితము కాదని, నిత్యం స్మరించుకోవాల్సిన వారు విద్య నేర్పిన గురువులని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకూ దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు కతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు తెలంగాణ, సాంస్కతిక కళాకారుల బందం ఆలపించిన పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 37మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో 49 వ డివిజన్ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, డీఈఓ నారాయణరెడ్డి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నడికూడ
చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవిక్లబ్ హనుమకొండ, వాసవిక్లబ్ వనితా హనుమకొండ గ్రేటర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధకృష్ణన్ విగ్రహాన్ని ఆ క్లబ్ జిల్లా గవర్నర్ గార్లపాటి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ మచ్చ అనసూర్య ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మాని ంచింది. అనంతరంపాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ విగ్రహ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు పోల ంపల్లి విజేందర్, సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ నందికొండ సుగుణ, విద్యా కమిటీ చైర్మన్ తాళ్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నర్సంపేట
ఉపాధ్యాయులే రేపటి సమాజానికి మార్గదర్శకులని విజ్డమ్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఎస్డీ.జహంగీర్ అన్నారు. ఆదివారం పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 133వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్డీ.జావెద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సంజీవిని ఆశ్రమంలో...
మాతృభూమి చారిటేబుల్ ట్రస్టు నేతృత్వంలోని సంజీవిని ఆశ్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆశ్రమ చైర్మన్ డాక్టర్ ఏ.మోహన్‌రావు సతీమణీ వినోద సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లరించారు. ఈ కార్యక్రమంలో పార్టైమ్ ఉపాధ్యాయును శాలువలతో సన్మానించారు.
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ గార్లపాటి సంతోష్ కుమార్ హాజరై పాఠశాల ఉపాధ్యాయులను వాసవి వనిత క్లబ్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, జిల్లా సెక్రెటరీ తోట వైద్యనాథ్, జిల్లా ట్రెజరర్ నూతన్ కుమార్, కాజీపేట వాసవి క్లబ్ అధ్యక్షులు సూర్యప్రకాష్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు శ్రీదేవి, సెక్రెటరీ గద్దె రాము శోభ పాల్గొన్నారు.
నవ తెలంగాణ-నల్లబెల్లి
ఉత్తమ ఉపాధ్యాయులగా ఎన్నికైన కొలిపాక సంగీత, విజయలక్ష్మి, శివ కుమార్, అచ్చయ్యలను ఆదివారం ఎంఈఓ సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటుగా మండల నోడల్ ఆఫీసర్ రామస్వామి, ఉపాధ్యాయ బందం వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నవతెలంగాణ -ఐనవోలు
స్థానిక జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు ఆదివారం తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కత్తి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఖిలావరంగల్
గురుపూజోత్సవ వేడుకలు ఆదివారం 32వ డివిజన్లోని ఆకారపు వీరలక్ష్మీ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ-రవి హాజరై రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేటర్ పల్లం పద్మరవి మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాసవి క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-రాయపర్తి
ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను మండలంలో విధులు నిర్వహి స్తున్న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. జాతీయ ఉపాధ్యాయ దినో త్సవం సందర్భంగా 2021- 22 విద్యాసంవత్సరానికి మండలంలో నలుగురు ఎంపికయ్యారు.అప్పిడి వెంకట రెడ్డి(ఎంపీపీఎస్ రాయపర్తి), వట్నాల సత్యనారాయణ (ఎంపీపీఎస్ గోప్య తండా), ఎన్ శైలజ (ఆర్అండ్ఆర్ కాలనీ), డీ సదానందం (జెడ్పిఎస్ఎస్, రాయపర్తి)లు ఎంపికయ్యారు. వీరు ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ గోపి, డీఈఓ వాసంతి, డిప్యూటీ కలెక్టర్ హరి సింగ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలకు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అభినందనలు తెలియజేశారు.