Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నిరుపేదలందరికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి జన్ను సాంబయ్య డిమండ్ చేశారు. ఆదివారం వల్లబ్నగర్లోని అంబేద్కర్ భవనంలో తంపుల మొగిళి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమావేశంలో సాంబయ్య మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ప్రజలకు హామీలను ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం టీఆర్ఎస్కు పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వ భూములు కార్పోరేట్ కంపెనీలకు అప్పగించి పేదలకు మాత్రం మొండి చేయి చూపిస్తుందన్నారు. యేడేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క పేదోడికి ఇళ్లు ఇచ్చిన పాపానపోలేదని విమర్శించారు. భూములన్నీ కంపెనీలకు కట్టబెట్టి పేదోడికి ఇవ్వాలని అడిగితే ఎక్కడా లేదని చేతులెత్తడం శోచనీయమాన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకొంటున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఓట్లు రాగానే సంక్షేమ పథకాలను ఆశజూపి ఓట్లను దండుకుంటూ మొసగిస్తుందన్నారు. ఇచ్చిన వాగ్థానాలను అమలు పర్చకపోతే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలనన్నారు. ఈ సమావేశంలో ఆర్పీఐ జిల్లా కన్వీనర్ రెడ్డిమళ్ల వీరస్వామి, జిల్లా కోకన్వీనర్లు తంపుల మొగిళి, జన్నవరం లక్ష్మీ, గోద సుదర్శన్, కొట్టి రజిత తదితరులు పాల్గొన్నారు.