Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రం లోని ఎస్ఎల్ఎణ్ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల కార్యకర్తల విస్తత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు ఉమేష్ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని అన్నారు. సీఎం పట్ల బీజేపీ నేత బండి సంజరు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. నిజమైన రైతు నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. బీజేపీ నాయకులు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మ కానికి పెట్టి జన రంజకమైన పాలన చేస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ కోతలు ఉంటాయన్న ప్రతిపక్షాల వాదనను తిప్పికొడుతూ నిరంతర 24గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతిపక్షాల మాటలను తిప్పి కొడుతూ ప్రాజెక్టులునిర్మించారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. రైతులకు రైతుబీమా, రైతుబంధు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ నెల 6 నుండి 12 వరకు గ్రామకమిటీలను మహిళా కమిటీలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సెల్ కమిటీలను వివా దాలకు తావులేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అభివద్ధే ధ్యేయంగా భూపాలపల్లిని ముందువరుసలో ఉంచేందుకు కషి చేస్తున్నామన్నారు. సేవ చేసేందుకు మరో ఐదేండ్లు అవకాశం కల్పిస్తే పాలేరుగా పని చేస్తా నన్నారు. జెడ్పీ మాజీ చైర్మెన్ సాంబారి సమ్మారావు, ఎంపీపీ లక్ష్మి, పీఏసీఎస్ చైర్మెన్ విజన్ రావు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ రహీం, ఆలయ చైర్మెన్ మహేందర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, పరకాల మాజీ మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏ సీఎస్ వైస్ చైర్మెన్ పాపిరెడ్డి ఎంపీటీసీ సుమలత బిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు విద్యాసాగర్‌రెడ్డి, మధుసూదన్, ఐలయ్య, ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.