Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి కులదీప్ సింగ్
నవతెలంగాణ-కాశిబుగ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కులదీప్ సింగ్ అన్నారు. ఆదివారం అబ్బనికుంట రైతభవన్లో ఏర్పాటు చేసి కేంద్ర కమిటీ సమావేశంల్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మత ఛాందసవాదన్ని ప్రోత్సహిస్తూ దేశంలోని మైనార్టీ ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా నిరంకుశ పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీ విధానాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మారెడ్డి వెంకట్ రెడ్డి, కామ్రేడ్ విజరు కుమార్ చౌదరి, కామ్రేడ్ ప్రమోద్జా, కా|| లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భాషకర్ణ బాబు, మోర్తల చందర్ రావు, నార్ల చంద్రశేఖర్, అబ్దుల్ సయ్యద్ పాల్గొన్నారు.