Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని రహదారులు వర్షాలకు బురదమయంగా, గుంతలమయంగా మారడాన్ని నిరసిస్తూ ఆదివారం అఖిలపక్ష నాయకులు రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు నరహరిశెట్టి రామకష్ణ, చింతల రవిపాల్, మారపెల్లి రవీందర్, ఉప్పు రాజు, బాసాని విద్యాసాగర్, మామిడి సుదర్శన్‌లు మాట్లాడారు. మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే, రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్లు పట్టించుకోలేదని విమర్శించారు. మందారి పేట నుంచి ప్రగతి సింగారం వరకు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేసి మూడు నెలలు గడిచినప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు పనులను ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు నుంచి శాయంపేట వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణం శాయంపేటలో అసంపూర్తిగా నిలిచిపోయిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి, రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, రాజయ్య, రాజు, మహిళలు పాల్గొన్నారు.