Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసే విధానాలను వీడకపోతే ప్రజల చేతిలో పతనం తప్పదని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి హెచ్చరించారు. మండలంలోని ఇటుకాలపెల్లి గ్రామ పంచాయతీ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి సర్పంచ్ మండ రవీందర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పడం కోసం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక అంశాలు, మైనార్టీల సంక్షేమం పూర్తిగా విస్మరించిందన్నారు. ఉద్యోగ అవకాశాలను కల్పించకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను బరితెగించి అమ్ముతూ ప్రయివేటు, కార్పోరేట్ శక్తులకు కొమ్ముకా స్తుందని విమర్శించారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ కుల రాజకీయాలకు తెరలేపి ప్రజలను చీల్చి పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ప్రజలను ఊరడించి మోసగిస్తుందని దుయ్యపట్టారు. ఇలాంటి ప్రభుత్వాలు పరిపాలనలో కొనసాగితే ప్రజలు, రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రాబోయే రోజుల్లో ఇంటికి సాగనంపినప్పుడే సామాన్య ప్రజానీకం, రైతుల మనుగడ సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి ఎస్కే.అన్వర్, సీనియర్ నాయకులు పెండ్యాల సారయ్య, మంకాల శ్రీను, బసికే మొగిలి, నీరటి బాలకొమురు, వంగర వనయ్య, పులి రాజు, దేశి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని నాగర్లపెల్లి, మహేశ్వరం, లక్నెపెల్లి గ్రామాలలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల ఎదుట నిరసన తెలిపారు.
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు అన్నారు. హసన్‌పర్తి మండల పరిధిలోని 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్‌కి సమస్యల పరిష్కారం కోసం ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద సుచెందర్, సుమన్, రమేష్, పుల్ల హర్ష తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీఏ జంక్షన్లో నిరసన
నవతెలంగాణ-ఖిలావరంగల్
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం రంగశాయిపేట సీపీఐ(ఎం) కమిటీ సభ్యులు రంగశాయిపేట చౌరస్తాలో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రంగశాయిపేట కార్యదర్శి ఎం.సాగర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రజా పంపిణీ వ్యవస్థను నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని బలహీన పరిచిందన్నారు. 4లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక వర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కమిటీ నాయకులు యం.జ్యోతికష్ణ, మారయ్య, యాకయ్య, రాజు, సంతోష్‌కుమార్, ఆర్ఆర్ ఆనంద్, యాకూబ్‌పాషా, సుధాకర్, రజిత, సరిత, సంతోష, సైదాబీ, నజియా, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.