Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
సంక్షోభంలో ఉన్న సమాజాన్ని సాహిత్యం సంస్కరించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి ఆచార్య సూర్య ధనుంజరు ఆకాంక్షించారు. స్థానిక వర్తక సంఘం భవనంలో బంజారా విద్యావేత్తల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ ధనుంజయ నాయక్ అధ్యక్షతన విశ్రాంత రైల్వే ఉద్యోగి మూడ్ కష్ణ చౌహాన్ ఐఆర్టీఎస్ చేత రచించబడిన 'గోర్ బంజారా వాచ్కరణి' (బంజారా భాషా వ్యాకరణం) పుస్తకాన్ని కవులతోపాటుగా ఆమె ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమాజంలో కనుమరుగవుతున్న మానవ సంబంధాలను పెంపొందించేందుకు సాహిత్యం సాధనంగా ఉపయోగపడాలని కోరారు. కవులు, రచయితలు రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూ కష్టజీవులకు బాసటగా నిలవాలని సూచించారు. అక్షరం రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదల్లకు కదలిక అన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం రచయిత దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు మెమోంటోలు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ మూడ్ శివాజీ చౌవాన్, సర్పంచ్ అజ్మీర్ బన్సీలాల్, సమీక్షకులు తెలుగు పండిట్ వీరన్న, టీవీవీ రాష్ట్ర నాయకుడు విశ్వ, రచయిత సోదరులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.