Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సుబేదారి
సంగెం మండలం తీగరాజు వల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధుడి హత్య కేసులోని నిందితులు మతుడి భార్యతో పాటు అతని చిన్న కుమారుడిని సంగెం పోలీసులు సోమవారం అరెస్టు చేసారు. అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ కె. వెంకటలక్ష్మి సోమవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. హంస సంపత్ నలబె ఏండ్ల క్రితం సుగుణను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేందర్ తహసీల్దార్ కార్యాలయములో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూ నర్సంపేట పట్టణంలో భార్య పిల్లలతో నివాసం వుంటున్నాడు. రెండో కొడుకు హంస ఆశోక్ వ్యవసాయం చేసుకుంటూ తీగరాజుపల్లిలోనే ఉంటు న్నాడు. సంపత్ తన భార్యతో కల్సి తన సొంత ఇంటిలో నివాసం వుంటూ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు.
సంపత్ పది రోజులకు ఒకమారు వరంగల్ నగరంలో లాడ్లో పనిచేసిన సమయంలో పరిచయం అయిన స్త్రీతో అక్రమ సంబంధాన్ని కొనసాగించేవాడు. ఈ విషయంలో మతుడితో భార్య, చిన్న కొడుకు పలుమార్లు పద్దతిని మార్చుకోవాలని చెప్పారు. అయినా వారి మాటలను వినకుండా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వారితో తిరుగుతూ సంపత్ జల్సా చేసేవాడు. ఈ విషయమై చిన్న కొడుకు మరోమారు నిలదీయడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగి తండ్రిని చిన్న కుమారుడు అశోక్ కోట్టాడు. దీంతో తండ్రి చిన్న కొడుకును ఇంటి నుంచి పంపించేశారు.
దీంతో కొడుకు అశోక్ మరో ఇంటిలో నివాసం వుంటున్నాడు. అదే విధంగా సంపత్‌కు తన తమ్ముడు చలపతితో భూమి విషయంలో గోడవలు వున్నాయి. గత ఐదుల క్రితం సంపత్ మరోసారి వరంగల్ నగరంలో పరాయిల స్త్రీతో తిగుతూ జల్సాలు చేశాడు. గత రెండు రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చిన సంపత్తో రాత్రి భార్య తీవ్ర స్తాయిలో గొడవకు దిగింది. ఈ సమయంలో సంపత్ భార్య అతని తిట్టి మనుమడి తీసుకుని గదిలోకి వెళ్లి విశ్రమించింది. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం (3వతేదిన) తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో కాలకత్యాల కోసం నిద్ర నుంచి లేచిన భార్య ఇంటి బయటికి వెళ్లగా వరండాలో అవస్మారక స్థితిలో పడి ఉన్న భర్తను చూసింది. భర్త ప్రక్కనే పురుగుల మందు డబ్బా పడివుండటంతో పాటు భర్త వద్ద పురువు మందు వాసన రావడంతో తన చిన్న కుమారుడి ఇంటికి వెళ్ళి విషయాన్ని తెలిపింది. దీంతో అశోక్ అక్కడికి వచ్చి తన తండ్రి చనిపోతే తన తల్లిమీదకు వస్తుందనే అనుమానంతో తానే తండ్రిని చంపి భూమి విషయంలో గొడవలు వున్న తన బాబాయి మీదకు నెట్టాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తల్లి, కొడుకులు ఇద్దరు అపస్మారక స్థితిలో వున్న తండ్రిని ఇంటి అవరణలోని చింత చెట్టుకు మతుడి ఒంటిమీద వున్న లుంగీని రెండుగా చింపి దానితోనే చేతులు, కాళ్ళను కట్టివేసి సంపత్ అరవకుండా నోటిలో బట్టలు ఉంచి అరటి పండ్లను కోసే కత్తిని గొంతులో బలంగా దింపారు. దీంతో సంపత్ అక్కడిక్కడే మతిచెందాడు.
తన తండ్రి మతిచెందినట్లుగా నిర్ధారించుకోని మతుడి ఒంటిమీద వున్న బనియన్ మార్చి నిందితులైన తల్లి కొడుకులు ఎవరి ఇండ్లలో వారు వెళ్ళి నిద్రించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న సంగెం పోలీసులు, మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్ పర్యవేక్షణలో పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, సంగెం ఎస్సై భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి పోలీసులు నిందితులను గుర్తించారు. మతుడు సంపత్‌ను హత్య చేసిన భార్య సుగుణ, చిన్న కొడుకు అశోక్‌లను పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేసారు. ఈ సందర్భంగా పోలీసులను కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.