Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్పీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
పసుల రవికుమార్
నవతెలంగాణ-కలెక్టరేట్
ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ అథవాలే) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పసుల రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరిగొమ్ముల స్నేహలత అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్వో వాసుచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్నేహలత మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితబంధుతోపాటు డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీలత, హనుమకొండ జిల్లా కార్యదర్శి శనిగరం అనిత, వరంగల్ జిల్లా అధ్యక్షులు మంగళపల్లి శంకర్, ములుగు జిల్లా అధ్యక్షుడు లద్దునూరి రమేశ్, నాయకులు రాజు, సునిల్, రఘు, శ్యాంసుందర్, సతీష్ పాల్గొన్నారు.