Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేటర్ కమీషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని గ్రేటర్ కమీషనర్ ప్రావీణ్య పేర్కొన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా విభాగాలలో పెండింగ్‌లో ఉన్న ఈ ఆఫీస్, సిటిజన్ బడ్డి ఫైళ్లను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గణేష్ నిమజ్జనం కొరకు చేసే ఏర్పాట్లపై సమీక్షించిన కమిషనర్ ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లను చేయాలన్నారు.
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు విభాగాల వారీగా ఇంజినీరింగ్ 07, టౌన్‌ప్లానింగ్ 21, హార్టికల్చర్ 01, ప్రజారోగ్య విభాగము 04, పన్నుల విభాగం-06 మొత్తం 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆదనపు కమీషనర్ సీహెచ్.నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ సునీత, సిటీ ప్లానర్ వెంకన్న, సెక్రటరీ విజయలక్ష్మి, డీఎఫ్ఓ కిశోర్, ఉప కమీషనర్లు జోనా, రవీందర్ పాల్గొన్నారు.