Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం హన్మకొండ కలెక్టరేట్ ఎదుట వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. దేశంలోని 60కోట్ల మంది రైతుల పొలాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి తెచ్చిన రైతు చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం కోసం తీసుకొచ్చిన నూతన విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు...
కార్మిక హక్కులను కాలరాసే రీతిలో తెచ్చిన నాలుగు కోడ్ లను బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. కరోనాతో మృతిచెందిన పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. దేశంలో ప్రజలందరికీ సార్వత్రిక ఉచిత టీక విధానాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల పోటీలుపడి పన్నులు విధిస్తూ ధరలను విపరీతంగా పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని వాపోయారు. నగరంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేద వారందరికీ 58 జీవో ప్రకారం పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాకు అధ్యక్షత వహించిన చుక్కయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, రైల్వేతో సహా అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ ప్రభాకర్ రెడ్డి, టీ. ఉప్పలయ్య, జిల్లా నాయకులు వీరన్న, తిరుపతి, సంతోష్, భాను నాయక్, మంద సంపత్, రమేష్ శ్రీకాంత్ మీస్రీన్. ల తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి
ఐనవోలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి లింగయ్య పిలుపునిచ్చారు. సోమవారం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు నారాయణరెడ్డి, నారాయణ. చిరంజీవి. బొమ్మకంటి యాకయ్య రవిబాబు. లెంకల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖిలా వరంగల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చింత మల్ల రంగయ్య, రాష్ట్ర కమీటీ సభ్యులు నలిగంటి రత్న మాలలు మాట్లాడారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ బీ. గోపికి సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు ముక్కెర రామస్వామి, సింగారపు బాబు, అరూరి కుమార్, అక్కినే పెళ్లి యాదగిరి, ఎం సాగర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి అన్నారు. సోమవారం వ్యవసాయ మూడు చట్టాలు, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం, నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, నాయకులు గుజ్జుల ఉమా, ఎస్కే.అన్వర్, హన్మకొండ సంజీవ, శ్రీనివాస్ రెడ్డి, ఇందిరా, పరిదా, నాగమణి, విలియాంకేరి, బాబు, విజయ, రాజు, స్వర్ణ లత, గీత, లక్ష్మి, యాకలక్ష్మి, సబ్బానీ రాజు, కార్తీక్, కోట రవి, నిఖిల్, కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.