Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- హన్మకొండ
సోమవారం కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన దండోరా యాత్రకు స్పందన కరువయ్యిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినరు భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన, బల్దియా మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర టిఆర్ఎస్ నాయకులతో కలిసి హన్మకొండ లోని అశోక కన్వెన్షన్ హాల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కొత్త, కొత్త పేర్లతో పాదయాత్రలు, దండోరా యాత్రలు చేస్తున్నారన్నారు. దళితులను, గిరిజనులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసారని, 70ఏళ్లుగా వారిని మోసం చేసింది కాంగ్రెస్నేనని ఆరోపించారు. 70ఏళ్లలో చేయని అభివద్ధిని ఏడేళ్ల లోనే చేశామన్నారు. రైతు బందు, రైతు బీమాతో పాటు 24గంటల కరేంటు ఇస్తున్నామని, ఈ పథకాలతో ఎక్కువ లబ్ది పొందేది దళిత గిరిజనులేనని పేర్కొనాన్రు. కాంగ్రెస్ పాలించిన 70 ఏళ్ళలో అభివద్ది జరిగిందా, టీఆర్ఎస్ పాలిస్తున్న 7ఏళ్లలో అభివద్ధి జరిగిందో దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. ఇక బీజేపీ రాష్ట్రంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తోందని విమర్శించారు. బండి సంజరు తెలంగాణలో యాత్ర కాకుండా ఢిల్లీ యాత్ర చేయాలని కోరారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ , గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడ యాత్ర చేస్తే తెలంగాణ ప్రజలు ఆనందిస్తారని అన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. దళిత, గిరిజనులకు న్యాయం చేసింది టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు చీకటి శారద ఆనంద్, తాడిశెట్టి విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు తాళ్లపళ్లి జానార్ధన్ గౌడ్, పులి రజనీకాంత్పాల్గొన్నారు.