Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోపని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, కరోనా చర్యలపై మండల స్పెషలాఫీర్ తుల రవి సోమవారం ఆరా తీశారు. తహసీల్దర్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీఓ కె.శ్రీధర్, ఎంఈఓ లకావత్ రాజేష్ కుమార్, ఎంపీఓ శ్రీకాంత్ బెహరాలతో కూడిన అధికారుల బృందం పాఠశాలల సందర్శనలో పాల్గొన్నారు. కరోనా భద్రతా చర్యలు, మధ్యాహ్న భోజన వసతి, ఉపాద్యాయుల హాజరుపై ప్రధానోపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, ఎంపీయూపీఎస్, కమలాపురం జెడ్పీహెచ్ఎస్, యూపీఎస్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి పౌష్టికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. మంగపేట ఎంపీయూపీఎస్ పాఠశాల మధ్యా హ్న భోజన నిర్వాహకులను అభినందించారు. ప్రతి రోజు ఇదే విధమైన భోజనాన్ని అందించేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి, మంజులలను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో తుల రవి అధ్యక్షతన మండల అధికారుల సమావేశం నిర్వహించారు.