Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి
పీఓ కష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీఓ కష్ణ ఆదిత్య అధికారులను హెచ్చరించారు. సోమవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐటీడీఏ ట్క్రెబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. అభివద్ధి పనుల రికార్డులను ఈ ఫైలింగ్ ద్వారా స్కానింగ్ చేసి భద్రపర్చాలని ఈఈ హేమలతను ఆదే శించారు. అనంతరం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆయా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొనసాగు తున్న అభివద్ధి పనులను అధికారుల నిత్య కార్యచరణను చర్చించారు.
ఈఎస్ఎస్పై ఆరా తీస్తున్నాం
ఈఎస్‌ఎస్‌లో రెండు సంవత్సరాల నుంచి జరిగిన అభివద్ధి పథకాల్లో అవినీతి జరిగినట్లు విలేకరులు కలెక్టర్ దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఈఎస్ఎస్పై క్షేత్రస్థాయిలో జరిగిన అభివద్ధి పనులను ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఏమైనా అవినీతి జరిగినట్లు వెల్లడైతే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదన్నారు. ట్రెబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ పరిధిలో జరిగిన పనుల్లో పెండింగ్ బిల్లులను మంజూరు చేసేందుకు ఫైల్స్ పెట్టమన్నారు. దూర ప్రాంతాల గిరిజనులు, వారి గ్రామాలపై ఎక్కువగా దష్టి పెడుతున్నట్లు తెలిపారు. ప్రతి అధికారి ములుగు వెలుగు యాప్‌లో హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖలోని ఖాళీలను త్వరలో భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా శాఖల వారీగా కేటాయించ బడిన అభివద్ధి పనుల్లో అధికారులు వాటిని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీఓ వసంత రావు, డీడీ ఎర్రయ్య, ఈఈ హేమలత, ఎస్ఓ రాజ్‌కుమార్, జీసీసీ డీఎం ప్రతాప ్రెడ్డి, పీఏఓ లక్ష్మిప్రసన్న, ఏఓ దామోదర స్వామి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీపీఎం సతీష్, పీసా కోఆర్డినేటర్ ప్రభాకర్, తహశీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.