Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-లింగాలఘనపురం
పేదింటి ఆడబిడ్డకు అండగా టీఆర్ ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ పథకం తీసు కొచ్చిందని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఇన్చార్జి తహసీల్దార్ దీరజ్ కుమార్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా ఆయన పాల్గొని మాట్లాడారు. నిరు పేదలకు సమన్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్బ అహర్నిశలు కషి చేస్తు న్నారని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, మండల అధ్యక్షుడు నాగేందర్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి మల్లేశం, నాయకులు శ్రీవారి, విష్ణు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.