Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కడియం ఫౌండేషన్ పేద విద్యార్థులకు అండగా నిలుస్తోందని కడియం ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు. చిల్పూర్ మండలంలోని చినపెండ్యాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోహిత, మేఘన, నిహారిక, గణేష్ జాతీయ మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపికైన సంధర్భంగా కడియం ఫౌండేషన్ తరపున సోమవారం ట్యాబ్‌లు బహుక రించారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రో త్సాహకారులుగా నిలుస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ విజ్ఞానాన్ని ఇనుమడించుకోవటానికి పోటీ పరీక్షలు ఉపకరిస్తాయన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో మొత్తం 20 మంది జాతీయ స్కాలర్షిప్కు ఎంపికయ్యా రని అన్నారు. వారికందరికీ కడియం ఫౌండేషన్ పక్షాన ప్రోత్సాహాన్ని అందిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో కడియం ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ నజీర్, తదితరులు పాల్గొన్నారు.