Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ తమ్మెర లక్ష్మీనర్సింహారావు
నవతెలంగాణ-తొర్రూరు
సమాజాభివద్ధికి ఉపాధ్యాయులు, జర్నలిస్టులు కీలక భూమిక పోషిస్తున్నారని తొర్రూరు లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ లక్ష్మీ నర్సింహారావు తెలిపారు. సోమవారం రాత్రి స్థానిక లయన్స్ భవన్లో ఉపాధ్యాయ, జర్నలిస్ట్ డే సందర్భంగా ఉపాధ్యాయులను, జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లక్ష్మీనర్సింహారావు పాల్గొని మాట్లాడారు. సమాజ అభివద్ధిలో కీలకమైన ఉపాధ్యాయులను, జర్నలిస్టులను సత్కరించడం గర్వంగా ఉందన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తమ్మి రమేష్, మండల స్థాయిలో జితేందర్‌రెడ్డి, చంద్రమౌళి, రమేష్, సురేందర్, పెద్దవంగర మండలంలో శిరీష, విజయలక్ష్మి, ముత్తిలింగంలను ఉత్తమ ఉపాధ్యాయులుగా గౌరవించి సత్కరించారు. అనంతరం 30 మంది పత్రికా విలేకరులను సన్మానించారు. అనంతరం విశిష్ట అతిథి పీడీజీ డాక్టర్ కుందూరు రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. క్లబ్ ఆధ్వర్యంలో ఏటా ఉపాధ్యాయులను, విలేకరులను గుర్తించి వారికి సన్మానం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్సీ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, జెడ్సీ డాక్టర్ శారద, పీడీసీ వెంకట్‌రెడ్డి, పీడీఎస్ విశ్వేశ్వరరావు, జిల్లా బాధ్యులు రేవూరి వెంకన్న, డాక్టర్ కిరణ్ కుమార్, పీజెడ్పీ సతీష్‌రెడ్డి, రీజనల్ సెక్రటరీ కొల్లూరు అశోక్, పూర్వ అధ్యక్షుడు తమ్మి ఉపేందర్, అధ్యక్షుడు యాకూబ్, జనరల్ సెక్రటరీ చీదిరాల నవీన్ కుమార్, కోశాధికారి చీధర మహేష్, గౌరవ సభ్యులు డాక్టర్ రామ్ నర్సయ్య, వనమాల నాగేశ్వరరావు, పెరుమాండ్ల రమేష్, నాగేష్, తమ్మి రమేష్, తదితరులు పాల్గొన్నారు.